Matrubasha Dinotsavam Celebrations@ADCGPTM

                              తెలుగు సంబరాలు – ఆదిత్య డిగ్రీ కళాశాల (గోపాలపట్నం)

తేదీ: 28 ఆగష్టు 2014 స్థానిక గోపాలపట్నం, విశాఖపట్నం ఆదిత్య డిగ్రీ & పి.జి కళాశాలలో  తెలుగు భాషాదినోత్సవాలు ఘనంగా జరిగాయి. గిడుగు రామూర్తి పంతులు గారి 151వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు  చేసిన తెలుగు భాషాదినోత్సవ సభకు విచ్చేసిన ప్రసిద్ధ కవి,విమర్శకులు శ్రీ రామ తీర్ధ గారు తెలుగు బాష ఔన్నత్యానికి గిడుగు చేసిన కృషిని వెల్లడించారు. “గిడుగు రామూర్తి పంతులు గారు గ్రాంధిక బాషకు పిడుగు,వ్యహరిక భాషా దీప్తికి గొడుగు” అని, వాడుక భాషలో కవిత్వము అంటే అది ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. విశిస్ట అతిధిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి  శ్రీమతి జగద్ధాత్రి గారు ,విధ్యార్ధులు మార్కుల కోసం, మాతృ భాషను వదిలి. మరో భాషకు మరలడం దురధృష్ట కరమని తెలియజేశారు. ప్రత్యేక అతిధి చిత్రకారిణి శ్రీమతి మల్ల జ్యోతిర్మయి అ ఆ ల తో ఒక గీతాన్ని సభలో ఆలపించి తమ మాతృభాషాభిమానాన్ని చాటుకున్నారు. సభాధ్యాక్షులు మరియు కళాశాల  అధ్యక్షులు శ్రీ కె.మురళిమోహనరావు  గారు విధ్యార్ధులు మాతృభాషతో  పాటు నైతిక విలువలు అలవరుచుకొని సంఘానికి కీర్తిని తీసుకురావాలని హితవు పలికారు.

ఈ సభలో వైస్ ప్రిన్సిపల్ కె.జనార్ధనరావు, తెలుగు అధ్యాపకులు,విధ్యార్ధినీ విధ్యార్ధులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *