తెలుగు భాషా దినోత్సవ వేడుకలు-ఆదిత్య స్కూల్,జి.మామిడాడ

దేశ బాషలందు తెలుగు లెస్స” అనే స్ఫూర్తితో వ్యావహారిక భాషా పితామహుడయిన శ్రీ గిడుగు రామ్ముర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిత్య పాఠశాల యందు 29-08-2016 సోమవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ రోజు ఉదయం ప్రార్ధనా సమయం నుండి ప్రిన్సిపాల్ V.రాజేష్ గారి ఆజ్ఞమేరకు విద్యార్ధులందరు తెలుగులో మాట్లాడారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో భాగంగా 9వ తరగతి విద్యార్ధి గిడుగు రామ్ముర్తి గారి వేషధారణలో విద్యార్ధులందరిని ఆకర్షించాడు. ఉదయం ప్రాధమిక స్థాయి విద్యార్ధులకు, మద్యాహ్నం మాధ్యమిక స్థాయి విద్యార్ధులకు “తెలుగు క్విజ్” నిర్వహించగా విద్యార్ధులు చురుకుగా పాల్గొని విజేతలు బహుమతులను అందుకున్నారు.

1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 1 (14) 1 (15)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *