‘మాతృ భాషా దినోత్సవం’ సందర్భంగా పిఠాపురంలో ఆదిత్య స్కూల్ నందు గిడుగు వెంకటరామమూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలను నిర్వహించింది

‘మాతృ భాషా దినోత్సవం’ సందర్భంగా పిఠాపురంలో ఆదిత్య స్కూల్ నందు గిడుగు వెంకటరామమూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలను నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సంస్కృత భాషా నిపుణులు ఇంద్రగంటి వెంకటగోపాల కృష్ణగారు విచ్చేసి, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు. పరభాషలను అభ్యసించిన మాతృ భాషను మరిచిపోవద్దని తెలిపారు.

పలువురు విద్యార్ధులు పద్యాలను, గేయాలను లయబద్ధంగా పాడి అలరించారు. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయాన్ని నృత్యరూపంలో, తెలుగు తల్లి వేషధారణతో అందరిని ఆకర్షించారు.

చమత్కర విషయాలు, చిలిపి ప్రశ్నలు, పొడుపు కధలు, సామెతలు, కవితలు, దుర్యధనుడి ఏకపాత్రాభినయం, చిన్నారుల హాస్య నాటకం, పదాలను తారుమారు చేయడం మరియు “తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది” అంటు విద్యార్ధులు పాడిన పాట అందరిని ఆకట్టుకున్నాయి.  

 

You may also like...